92 అల్ లైల్
ఆయతులు
: 21 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 11 ఆవరించినప్పటి రాత్రి సాక్షిగా! ప్రకాశించునప్పటి పగలు సాక్షిగా! మగ, ఆడ జాతుల్ని సృష్టించినవాడు సాక్షిగా! వాస్తవంగా మీరు చేసే ప్రయత్నాలు విభిన్న రకాలుగా ఉంటాయి. కనుక ఎవరు (దైవమార్గంలో) ధనాన్ని వినియోగించాడో, (దైవ అవిధేయతకు) భయపడ్డాడో, మంచిని సత్య మని అంగీకరించాడో, అతనికి మేము సన్మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తాము. ఎవరు పిసినారితనం వహించాడో, (దేవునిపట్ల) నిర్లక్ష్యవైఖరి అవలంబించాడో, పైగా మంచిని తృణీకరించాడో, అతనికి మేము కఠిన మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తాము. అతను నశించి నప్పుడు ఇక అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?
12 - 21 నిస్సందేహంగా సన్మార్గం చూపవలసిన బాధ్యత మాపై ఉంది. వాస్తవానికి పరలోకం, ఇహలోకం రెండిటికీ మేమే యజమానులం. కనుక నేను మిమ్మల్ని ప్రజ్వలించే అగ్ని
గురించి హెచ్చరించాను. (సత్యాన్ని) తిరస్క రించి, ముఖం తిప్పుకున్న పరమ దౌర్భాగ్యుడు తప్ప మరెవ్వరూ అందులో కాలిపోరు. పరిశుద్ధుడు కావటానికి తన సంపదను ఖర్చుచేసే పరమ దైవభీతి పరుడు దానికి దూరంగా ఉంచబడతాడు. అతనికి ఎవ్వరూ ఏ విధమైన ఉపకారం చేయలేదు, దానికి అతను బదులు తీర్చేందుకు. అతను కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే ఈ పని చేస్తున్నాడు. ఆయన తప్పకుండా (అతడంటే) సంతోషిస్తాడు.
No comments:
Post a Comment