81 సూరహ్ అత్ తక్వీర్

 

81 అత్ తక్వీర్

ఆయతులు : 29                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 14 సూర్యుడు చుట్టివేయబడినప్పుడు, నక్షత్రాలు చెదరిపోయినప్పుడు, పర్వతాలు నడిపించ బడినప్పుడు, పదినెలల చూలి ఒంటెలు వాటి మానాన అవి వదిలివేయబడినప్పుడు, అడవి జంతువులు ఒకచోట సమీకరించబడి నప్పుడు, సముద్రాలు ప్రజ్వలింపజేయబడినప్పుడు, ప్రాణాలు (శరీరాలతో) తిరిగి కలపబడినప్పుడు, సజీవంగా పాతిపెట్టబడిన బాలికను,  నీవు  తప్పువల్ల హత్య చేయబడ్డావని అడిగినప్పుడు, కర్మల పత్రాలు తెరువబడి నప్పుడు, ఆకాశానికున్న తెర తొలగించ బడినప్పుడు, నరకం మండిరచ బడినప్పుడు, స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు - అప్పుడు ప్రతి మనిషికీ తెలిసిపోతుంది తానేమి తీసుకువచ్చాడో.

15 - 29 కనుక (మీరనుకునేది ఎంతమాత్రం నిజం) కాదు. మరలిపోయే, కనుమరుగయ్యే నక్షత్రాలు సాక్షిగా, గడచిపోయినప్పటి రాత్రి సాక్షిగా, ఊపిరి పీల్చుకున్నప్పటి ఉదయం సాక్షిగా, నేను చెబు తున్నాను, ఇది నిశ్చయంగా అత్యంత గౌరవనీయుడైన ఒక సందేశహరుని వాక్కు, ఆయన ఎంతో శక్తి సంపన్నుడు,  సింహాసనాధిపతి వద్ద ఆయనకు  గొప్ప  స్థానం ఉంది. అక్కడ ఆయన ఆజ్ఞలు పాటించబడతాయి, ఆయన ఎంతో నమ్మకస్తుడు. ( మక్కా ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాదు. ఆయన సందేశ హరుణ్ణి ప్రకాశవంతమైన దిఙ్మండలంపై చూశాడు. అదీగాక అగోచర విషయా లకు సంబంధించిన ( జ్ఞానాన్ని ప్రజలకు అందించే) విషయంలో ఆయన లోభికాడు. ఇది శాపగ్రస్తుడైన షైతాను వాక్కూ కాదు.  అలాంటప్పుడు మీరు ఎటు వెళ్ళిపోతున్నారు. ఇది సకల లోకాల వారి కొరకు ఒక హితోప దేశం, మీలో ఋజుమార్గాన నడవదలచిన ప్రతి వ్యక్తి కొరకు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంతవరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీకాదు.

No comments:

Post a Comment