18 సూరహ్ అల్‌ కహఫ్

 

18 అల్కహఫ్

ఆయతులు : 110                    అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

18 అల్కహఫ్  1 - 5 అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన తన దాసునిపై గ్రంథాన్ని అవతరింపజేశాడు  అందులో విధమైన వక్రత్వాన్నీ ఉంచలేదు - అది సూటిగా, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే గ్రంథం  దాని ద్వారా అతను దేవుని కఠిన శిక్షను గురించి ప్రజలను హెచ్చరించాలని, విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి మంచి ప్రతిఫలం లభిస్తుంది  అనే శుభవార్తనూ,  అందులోనే వారు కలకాలం ఉంటారు అనే శుభవార్తనూ  అందజేయాలని, అల్లాహ్ ఎవరినో కుమారుడుగా వరించాడు అని పలికే ప్రజలను భయపెట్టాలని. విషయం గురించి వారికిగానీ, వారి తాతముత్తాలకు గానీ జ్ఞానమూ లేదు. వారి నోట వెలువడే మాట అత్యంత దారుణమైనది. వారు కేవలం అబద్ధాన్ని మాత్రమే వాగుతున్నారు.

18 అల్కహఫ్  6 - 8 అయితే ప్రవక్తా! ఒకవేళ వారు ఉపదేశాన్ని విశ్వసించకపోతే, బహుశా నీవు వారి కోసం ద్ణుఖిస్తూ నీ ప్రాణాన్నే కోల్పోతావేమో! నిజానికి, ప్రజలలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించాలని, భూమిపై ఉన్న వస్తు సామగ్రినంతటినీ మేము భూమికి అలంకారంగా చేశాము. చివరకు మేము దీనినంతటినీ చదునైన మైదానంగా చేసివేయనున్నాము.

18 అల్కహఫ్  9 - 12 గుహవారు,  శిలాఫలకం  వారు మా సూచనలలో ఒక అద్భుతమైన సూచన అని  మీరు భావిస్తున్నారా?  గుహలో ఆశ్రయం పొందిన యువకులు ‘‘ప్రభూ! నీ ప్రత్యేక  కారుణ్యాన్ని మాకు ప్రసాదించు మా వ్యవహారాన్ని చక్కబెట్టు!’’ అని వేడుకున్నారు. అప్పుడు మేము వారిని అదే గుహలో జోకొట్టి ఏళ్లతరబడి గాఢనిద్రలో ఉంచాము. తరువాత మేము వారిని మేల్కొలిపాము, రెండు వర్గాలలో వర్గం వారు తాము గుహలో ఉన్న కాలాన్ని కచ్చితంగా లెక్కకడతారో పరీక్షిద్దామని.

18 అల్కహఫ్  13 - 16 మేము వారి అసలు గాధను నీకు వినిపిస్తున్నాము. వారు తమ ప్రభువును  విశ్వసించిన  కొందరు యువకులు. మేము వారికి సన్మార్గంపై నడవటంలో అభివృద్ధిని ప్రసాదించాము. వారు లేచి ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము  ‘‘ఆకాశాలకూ, భూమికీ ప్రభువైనవాడే మా ప్రభువు. మేము ఆయనను త్రోసిరాజని మరొకణ్ణి దేవుడుగా చేసుకొని వేడుకోము. ఒకవేళ మేము అలా చేస్తే, పూర్తిగా అనుచితమైన దానిని చేసిన వారమవుతాము.’’  (తరువాత వారు పరస్పరం ఇలా అను కున్నారు) మన జాతివారైన వీరు విశ్వప్రభువును కాదని ఇతర దైవాలను సృష్టించుకున్నారు. దైవాలు ఆరాధ్యులని స్పష్టమైన ప్రమాణాన్ని దేన్నయినా ప్రజలు ఎందుకు తీసుకురారు? అల్లాహ్ విషయంలో అభూత కల్పనకు పాల్పడే వాడిని మించిన దుర్మార్గుడెవడు?  ఇప్పుడు మీరు వారితోను, అల్లాహ్ ను కాదని వారు ఆరాధించే  దేవుళ్లతోను సంబంధాలను త్రెంచు కున్నారు. కనుక, ఇక పదండి. ఫలానా గుహలో ప్రవేశించి ఆశ్రయం పొందండి. మీ ప్రభువు మీపై తన కారుణ్య ఛాయను విస్తరింపజేస్తాడు, మీ కార్యసిద్ధికై సకల సామగ్రిని సమకూరుస్తాడు.

18 అల్కహఫ్  17 - 18 వారిని నీవు గుహలో చూసినప్పుడు, సూర్యుడు ఉదయించేటప్పుడు, వారి గుహను తాకకుండా కుడి ప్రక్కగా పైకిపోయినట్లునూ, అస్తమించేటప్పుడు వారికి దూరంగా ఎడమ ప్రక్కగా దిగిపోయినట్లునూ నీకు గోచరిస్తుంది. వారేమో గుహలోపల ఒక సువిశాలమైన స్థలంలో పడి ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనలలో ఒక సూచన.  అల్లాహ్ సన్మార్గం చూపినవాడే అసలు సన్మార్గం పొందేవాడు. అల్లాహ్ - మార్గం తప్పించేవాడికి మార్గం చూపి, సంరక్షించేవాణ్ణి నీవు పొందలేవు. వారిని నీవు చూచి, వారు మేల్కొనే ఉన్నారని అనుకుంటావు. వాస్తవానికి వారు నిద్రపోతున్నారు. మేము వారిని కుడిప్రక్కకూ, ఎడమ ప్రక్కకూ దొరిలేలా మరలిపడుకునేలా చేసేవారము  వారి కుక్క గుహ ముఖ ద్వారం వద్ద  ముందు కాళ్ళను చాచి కూర్చుండి ఉండేది. ఒకవేళ నీవు వారిని తొంగిచూస్తే, వెనక్కి తిరిగి పారిపోతావు. దృశ్యాన్ని చూసిన కారణంగా నీవు భయకంపితుడవు అవుతావు.

18 అల్కహఫ్  19 - 21 మేము ఇదే అద్భుత మహిమ ద్వారా వారిని మేల్కొలిపి కూర్చో బెట్టాము. వారు పరస్పరం ప్రశ్నించుకోవాలని  వారిలో ఒకడు,  ‘‘మనం స్థితిలో ఎంతకాలం ఉన్నాము?’’ అని అడిగాడు. మిగతావారు, ‘‘బహుశా ఒక రోజంతానో లేక దానికంటే కొంచెం తక్కువగానో ఉండి ఉంటాము’’ అని అన్నారు.  మళ్లీ ఇలా అన్నారు వారంతా, ‘‘అల్లాహ్ యే బాగా ఎరుగును మనం స్థితిలో ఎంతకాలం గడిపామో. సరే, ఇక వెండి నాణాన్ని ఇచ్చి మనలో ఎవరినైనా నగరానికి పంపుదాము. అతడు మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందో కనుక్కొని, తినటానికేదైనా తీసుకువస్తాడు. అతడు కాస్త తెలివిగా వ్యవహరించాలి. మనం ఇక్కడున్నామని ఎవరికైనా తెలిసే విధంగా అతడు ప్రవర్తించకూడదు. ఒకవేళ వారు మనల్ని పట్టుకుంటే, రాళ్లతో కొట్టి చంపేస్తారు. లేదా బలవంతంగా మనల్ని తమ సంఘంలో మళ్లీ కలుపుకుంటారు. అలా జరిగితే, మనం ఎన్నటికీ సాఫల్యం పొంద లేము.’’ విధంగా మేము నగరవాసులకు వారి ఉనికిని గురించి తెలియ జేశాము. అల్లాహ్ చేసిన వాగ్దానం సత్యమైనదనీ ప్రళయ సమయం నిస్సం దేహంగా వచ్చి తీరుతుందనీ ప్రజలు తెలుసుకోవాలని (అప్పుడు వారు అసలు ఆలోచించవలసినది పై విషయం గురించి). కాని ప్రజలు వారి (గుహ వాసుల)తో  ఎలా  వ్యవహరించాలి అనే విషయం గురించి పరస్పరం వాదులాడుకుంటున్నారు. కొందరు ‘‘వారిమీద ఒక గోడ కట్టండి. వారి ప్రభువుకే వారి వ్యవహారం గురించి బాగా తెలుసు’’ అని అన్నారు. కాని వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు, ‘‘మేము వారిమీద ఒక ఆరాధనా మందిరాన్ని నిర్మిస్తాము’’ అని అన్నారు.

18 అల్కహఫ్  22 - 26 కొంతమంది, ‘‘వారు ముగ్గురు, నాలుగోది వారి కుక్క’’ అని అంటారు. మరికొందరు, ‘‘వారు ఐదుగురు, ఆరోది వారి కుక్క’’ అని అంటారు. వారందరూ కేవలం అర్థరహితంగా వాగుతున్నారు. ఇంకా కొందరు, ‘‘వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క’’ అని కూడ అంటారు.ఇలా అను:  ‘‘వారు  ఎందరో  నా ప్రభువే బాగా ఎరుగును. కొందరికి మాత్రమే వారి నిజమైన సంఖ్య తెలుసు. కనుక స్థూలంగా తప్ప వారి సంఖ్యను గురించి ప్రజలతో వాదించకు. ఇంకా వారిని గురించి ఎవరినీ ఏమీ అడగవద్దు. చూడు విషయాన్ని గురించిjైునా, ఎన్నడూ ‘‘నేను పనిని రేపు చేస్తాను’’ అని అనకు. (నీవు ఏమీ చేయలేవు) అల్లాహ్ కోరితేనే తప్ప. ఒకవేళ మరపువల్ల నీవు అలా అంటే, వెంటనే నీ ప్రభువును స్మరించుకొని ఇలా అను, ‘‘నా ప్రభువు వ్యవహారంలో సత్యానికి అతి దగ్గరగా ఉన్న విషయం వైపునకు నాకు మార్గం చూపుతాడని నేను ఆశిస్తున్నాను.’’ - వారు తమ గుహలో మూడు వందల సంవత్సరాలు ఉన్నారు, (కొందరు గడువు అంచనాలో) తొమ్మిది సంవత్సరాలు ఇంకా ఎక్కువ పెంచారు. నీవు ఇలా చెప్పు:  ‘‘వారు  స్థితిలో ఉన్న కాలాన్ని అల్లాహ్ యే బాగా ఎరుగును. ఆకాశాలలోనూ, భూమిలోనూ గుప్తంగా ఉన్న సమస్త విషయాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఎంత అద్భుతమైనవాడు చూసేవాడు వినేవాడు (భూమ్యాకాశాలలోని సృజింపబడిన వాటిని) ఆయన తప్ప (ఆదుకునేవాడు) మరెవ్వడూ లేడు. అంతేకాదు ఆయన తన ప్రభుత్వాధికారంలో ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు.’’

18 అల్కహఫ్  27 - 31 ప్రవక్తా! నీ ప్రభువు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దానిని (యథాతథంగా) వినిపించు. ఆయన ప్రవచనాలను మార్చే అధికారం ఎవరికీ లేదు. (ఒకవేళ ఎవరికోసమైనా నీవు అందులో మార్పులు, చేర్పులు చేసినట్లయితే) ఆయనను తప్పించుకొని పారిపోయి నీవు ఆశ్రయాన్నీ పొందలేవు. తమ ప్రభువు ప్రసన్నతను అర్థిస్తూ ఎవరు ఉదయం, సాయంత్రం ఆయనను వేడుకుంటారో, వారి సాహచర్యం పట్ల నీ హృదయాన్ని సంతృప్తి పరచుకో.  వారి  నుండి  నీ  దృష్టిని ఏమాత్రం మరల్చకు. నీవు ఇహలోకపు మెరుగులను కోరుకుంటావా? ఎవని మనస్సును మేము మా ధ్యానం పట్ల శ్రద్ధలేకుండా చేశామో,   ఎవడు   తన వాంఛలకు అనుగుణంగా వర్తించాడో, ఎవడి పనితీరు అతివాదంపై ఆధారపడి ఉంటుందో అటువంటి వ్యక్తి పట్ల విధేయత చూపకు. స్పష్టంగా ఇలా ప్రకటించు, ‘‘ఇది సత్యం మీ ప్రభువు నుండి వచ్చింది. ఇష్టమైన వారు దానిని స్వీకరించనూవచ్చు, ఇష్టంకాని వారు దానిని తిరస్కరించనూవచ్చు. మేము (సత్యాన్ని తిరస్కరించే) దుర్మార్గుల కొరకు ఒక అగ్నిని సిద్ధపరచి ఉంచాము, దాని జ్వాలలు వారిని చుట్టు ముట్టుతాయి. అక్కడ వారు గనుక మంచినీళ్లు అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారిని సత్కరించటం జరుగుతుంది.  అది వారి ముఖాలను మాడుస్తుంది. అది ఎంత జుగుప్సాకరమైన పానీయం! అది ఎంత నికృష్టమైన విశ్రాంతి స్థలం! ఇక విశ్వసించి సత్కార్యాలు చేసేవారి విషయం - మేము నిశ్చయంగా వారి ప్రతిఫలాన్ని వృధాచేయము. వారికై నిత్య హరితవనాలు ఉన్నాయి  వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి  అక్కడ వారు బంగారు కంకణాలను ధరిస్తారు  ఆకు పచ్చని సన్నని జలతారు పట్టువస్త్రాలను ధరిస్తారు  ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. అది ఎంత శ్రేష్ఠమైన ప్రతిఫలం! అది ఎంత మహోన్నతమైన నివాస స్థలం!

18 అల్కహఫ్  32 - 44 ప్రవక్తా! వారి ముందు ఒక ఉపమానం పేర్కొను: ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారిలో ఒకనికి మేము రెండు ద్రాక్ష తోటలు ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను పెంచాము.  ఇంకా వాటి మధ్య సేద్యపు భూమిని ఉంచాము. రెండు తోటలు పుష్కలంగా పండాయి. పండటంలో అవి ఎంత మాత్రమూ కొరత చూపలేదు. తోటల మధ్య ఒక కాలువను ప్రవహింపజేశాము. యజమానికి మంచి లాభాలు వచ్చాయి. ఇదంతా పొంది కూడా అతడు ఒకనాడు తన పొరుగు మిత్రునితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: ‘‘నేను నీ కంటే ఎక్కువ ధనం కలవాణ్ణి, ఎక్కువ బలవంతులైన జనం కలవాణ్ణి.’’ తరువాత అతడు తన స్వర్గంలో ప్రవేశించాడు  తన ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడై ఇలా ప్రకటించాడు: ‘‘ఎన్నటికైనా సంపద నశిస్తుందని నేను భావించటం లేదు. ఎప్పటికైనా ప్రళయ ఘడియ వస్తుందనే నమ్మకం కూడ నాకు లేదు. అయినప్పటికీ, ఒకవేళ ఎప్పుడైనా నేను నా ప్రభువు సన్నిధికి మరలింపబడినట్లయితే తప్పకుండా దీనికంటే మహోజ్వలమైన స్థానాన్ని పొందుతాను.’’ అప్పుడు అతని పొరుగువాడు మాట్లాడుతూ అతనితో ఇలా అన్నాడు: ‘‘నిన్ను మట్టితోనూ, తరువాత వీర్య బిందువుతోనూ పుట్టించి ఒక సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దిన ఆయనను నీవు తిరస్కరిస్తున్నావా? ఇక నా విషయం, నా ప్రభువైతే అల్లాహ్ యే. నేను ఎవరినీ ఆయనకు భాగస్వామిగా చేయను. నీవు నీ వనంలోకి ప్రవేశిస్తూ ఉన్న సమయంలో నీ నోట మాషా అల్లాహ్’ ‘లాఖువ్వత ఇల్లా బిల్లాహ్అనే మాటలు ఎందుకు రాలేదు? ఒకవేళ నీవు నన్ను సంపదలో, సంతానంలో నీ కంటె తక్కువ వాడిగా చూస్తూ ఉన్నప్పటికీ, నా ప్రభువు నీ స్వర్గం కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించటమూ, నీ స్వర్గంమీదకు ఆకాశం నుండి ఏదైనా ఆపదను పంపించటమూ, కారణంగా అది చదునైన మైదానంగా మారిపోవటమూ లేదా దాని నీరు భూమిలో ఇంకిపోవటమూ తరువాత నీవు దానిని విధంగానూ తిరిగి పొందలేకపోవటమూ అనేది అసంభవమేమీ కాదు.’’ చివరకు జరిగిందేమిటంటే, అతని పంట మొత్తం ధ్వంసం అయింది, తన ద్రాక్షతోట తలక్రిందులుగా తడికలపై కూలి పోవటాన్ని చూచి అతడు తాను పెట్టిన పెట్టుబడిని గురించి చేతులు నులుముకుంటూ ఉండిపోయాడు. ఇంకా ‘‘అయ్యో! నేను నా ప్రభువునకు ఇతరులెవరినీ భాగస్థులుగా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది!’’ అని వాపోయాడు - అల్లాహ్ కు వ్యతిరేకంగా అతనికి సహాయపడటానికి  అతని  వద్ద జన సమూహమూ లేకుండా పోయింది. అతడు స్వయంగానూ    ఆపదను ఎదుర్కోలేకపోయాడు - అప్పుడు తెలిసింది ఆదుకునే శక్తి ఒక్క సత్యదేవునికే ఉందని, ఆయన ప్రసాదించే బహుమానమే ఉత్తమమైనదని, ఆయన చూపించే ఫలితమే శ్రేష్ఠమైనదని.

18 అల్కహఫ్  45 - 49 ప్రవక్తా! ఐహిక జీవిత వాస్తవాన్ని వారికి ఉపమానం ద్వారా బోధించు: ఈనాడు మేము ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తే నేలపై పచ్చిక బాగా దట్టంగా పెరుగుతుంది.  మరునాడు అదే పచ్చిక పొట్టుగా మారి పోతుంది. దానిని గాలులు లేపుకుపోయి తిరుగుతూ ఉంటాయి. అల్లాహ్ ప్రతి దానిపై అధికారం కలవాడు. సంపదా,    సంతానమూ కేవలం ఐహిక జీవితపు తాత్కాలిక అలంకారాలు మాత్రమే. అసలు, శాశ్వతంగా ఉండిపోయే పుణ్యకార్యాలే నీ ప్రభువు దగ్గర పరిణామం రీత్యా ఉత్తమమైనవి. కాబట్టి వాటి మీదనే పెద్ద ఆశలు పెట్టుకోవచ్చు. ఆలోచించవలసినది రోజును గురించి:    రోజున మేము పర్వతాలను నడిపిస్తాము, భూమి అంతా బోసిపోయినట్లుగా మీరు చూస్తారు. (ఆదిమానవులలో, అంత్య మానవులలో) ఒక్కరు కూడ మిగిలిపోకుండా మేము మానవులందరినీ చుట్టుముట్టి సమావేశపరుస్తాము. వారంతా నీ ప్రభువు సాన్నిధ్యంలో వరుసలు వరుసలుగా ప్రవేశపెట్టబడతారు-  ఇదిగో చూడండి, మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన స్థితిలోనే మీరు మా వద్దకు వచ్చేశారు కదా! మాతో సమావేశమయ్యే కాలాన్ని దేనినీ మేము మీ కొరకు నిర్ణయించనేలేదని మీరు భ్రమపడ్డారు - అప్పుడు కర్మల పత్రం వారి ముందు ఉంచబడుతుంది. సమయంలో అపరాధులు తమ జీవిత గ్రంథంలో నమోదు చేయబడిన విషయా లకు భయపడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. వారు ‘‘అయ్యో  మా  దౌర్భాగ్యం! ఇదేమి గ్రంథం! మేము చేసిన చిన్న పనిగానీ, పెద్దపనిగానీ ఏదీ గ్రంథంలో నమోదు చేయబడకుండా ఉండలేదే’’ అని అంటూ ఉంటారు. వారు ఏమేమి చేశారో అదంతా తమ ముందు ప్రత్యక్షం కావటాన్ని చూస్తారు. నీ ప్రభువు ఎవరికీ ఏమాత్రమూ అన్యాయం చేయడు.

18 అల్కహఫ్  50 - 51 విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో  ఆదమ్కు సజ్దా చేయమని మేము దైవదూతలతో అన్నప్పుడు వారు అతనికి సజ్దా చేశారు, కాని ఇబ్లీస్చేయలేదు. అతడు జిన్నాతులలోనివాడు, కనుకనే తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించటానికి ఒడిగట్టాడు. మీరు నన్ను కాదని వాడూ, వాడి సంతతీ మీకు శత్రువులైనప్పటికీ, మీరు వారిని మీకు సంరక్షకులుగా చేసుకుంటారా? దుర్మార్గులెంత చెడ్డ ప్రత్యామ్నాయాన్ని వరిస్తున్నారు! నేను ఆకాశాన్నీ, భూమినీ సృష్టించేటప్పుడు వారిని ఆహ్వానించలేదు. స్వయంగా వారిని సృష్టించే టప్పుడు సైతం వారిని నాకు భాగస్వాములుగా చేసుకోలేదు. మార్గం తప్పించే వారిని సహాయకులుగా చేసుకోవటం నా పనికాదు.

18 అల్కహఫ్  52 - 53 వారి ప్రభువు వారితో ఇలా అనే రోజున వారు ఏమి చేస్తారు? ‘‘ఇప్పుడు పిలవండి మీరు, నాకు భాగస్వాములని మీరు భావిస్తున్న శక్తులను.’’ అప్పుడు వారు వారిని పిలుస్తారు. కాని వారు వారి సహాయానికై రారు. మేము  వారికి  ఒకే వినాశ గుండాన్ని ఏర్పాటు చేస్తాము. అపరాధు లందరూ   రోజున అగ్నిని చూస్తారు. ఇక తాము అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు, దాని నుండి తప్పించుకోవటానికి వారు ఆశ్రయాన్నీ పొందలేరు.

18 అల్కహఫ్  54 - 55 మేము ఖురానులో ప్రజలకు పలు విధాలుగా హితవు గరపాము. కాని మానవుడు పరమ జగడాలమారి. వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు, దానిని స్వీకరించకుండా, తమ ప్రభువు సన్నిధానంలో క్షమాభిక్షను కోరకుండా, అసలు వారిని విషయం వారించింది? విషయం ఇది తప్ప మరొకటేమీ కాదు - పూర్వపు  జాతుల విషయంలో జరిగినదే తమ విషయంలో కూడ జరగాలని వారు నిరీక్షిస్తున్నారు. లేదా శిక్ష తమ ముందుకు వస్తూ ఉండగా చూడాలని వారు కోరుకుంటున్నారు.

18 అల్కహఫ్  56 - 57 మేము ప్రవక్తలను, శుభవార్తను అందజేసేందుకూ హెచ్చరికను చేసేందుకూ తప్ప మరే ఉద్దేశ్యంతోనూ పంపము. కాని, అవిశ్వాసులు అసత్యవాదపు ఆయుధాలతో సత్యాన్ని ఖండిరచటానికి ప్రయత్నం చేస్తారు, వారు నా వాక్యాలనూ,  వారికి చేయబడిన హెచ్చరికలనూ హాస్యంగా తీసు కున్నారు. ఇక  తన  ప్రభువు వాక్యాలను అతనికి వినిపించి హితోపదేశం చేయగా, వాటికి విముఖుడై, తనకు తానే చేతులారా చేసుకున్న దాని యొక్క దుష్పరిణామాన్ని మరచిపోయే వ్యక్తి  కంటే దుర్మార్గుడెవడు? ( వైఖరిని అవలంబించిన) వారి హృదయాలకు  మేము గలీబులు తొడిగాము. అవి వారిని ఖురానును అర్థం చేసుకోనీయవు  వారి చెవులకు మేము చెవుడు కలిగించాము. నీవు వారిని సన్మార్గం వైపునకు ఎంత పిలిచినా, వారు స్థితిలో ఎన్నటికీ సన్మార్గాన్ని పొందలేరు.

18 అల్కహఫ్  58 నీ ప్రభువు ఎంతో మన్నించేవాడు, కరుణించేవాడూను, వారి చేష్టలకు ఆయన వారిని పట్టుకోదలిస్తే, తొందరగానే శిక్షను పంపి ఉండేవాడు. కాని వారి శిక్షకోసం ఒక సమయం నిర్ణయించబడి ఉన్నది. దాని నుండి తప్పించుకుని పారిపోయే మార్గాన్నీ వారు పొందలేరు.

18 అల్కహఫ్  59 శిక్షకు గురిఅయిన పట్టణాలు మీ ఎదుట ఉన్నాయి. వారు దుర్మార్గం చేయగా, మేము వారిని నాశనం చేశాము. వారిలోని ప్రతి ఒక్కరి వినాశానికి మేము సమయం నిర్ణయించేసి ఉంచాము.

18 అల్కహఫ్  60 - 65 (మూసాకు సంబంధించిన గాధను వారికి వినిపించు) అప్పుడు మూసా తన సేవకునితో ఇలా అన్నాడు : ‘‘రెండు నదుల సంగమ స్థలానికి చేరనంతవరకు, నేను నా ప్రయాణాన్ని ఆపను. లేకపోతే నేను సుదీర్ఘకాలం నడుస్తూనే ఉంటాను.’’ తరువాత వారు వాటి సంగమ ప్రదేశానికి చేరినప్పుడు, తమ చేప విషయంలో అశ్రద్ధవహించారు. అది నదిలోకి సొరంగం గుండా పోయినట్లు దూసుకుపోయింది. ముందుకు పోయిన తరువాత, మూసా తన సేవకునితో ఇలా అన్నాడు, ‘‘మా ఉదయపు ఆహారం తీసుకురా. ఈనాటి ప్రయాణంలో మేము బాగా అలసిపోయాము.’’ సేవకుడు ఇలా అన్నాడు, ‘‘చూశారా ఏమయిందో! మనం రాయి వద్ద విశ్రాంతికై ఆగి ఉన్న సమయంలో నాకు చేప విషయమే జ్ఞాపకం లేకుండాపోయింది. షైతాను నన్ను ఏమరుపాటుకు గురిచేశాడు. నేను దాని ప్రస్తావనను (మీతో చెయ్యటం) మరచిపోయాను. చేప విచిత్రమైన రీతిలో బయటపడి నదిలోకి వెళ్ళిపోయింది.’’ మూసా ‘‘మనం అన్వేషిస్తూ వచ్చినది దీని కొరకేకదా!’’ అని అన్నాడు. కనుక వారు ఉభయులూ తమ అడుగుజాడలలో వెనక్కి తిరిగి వెళ్ళారు. అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుని కనుగొన్నారు  మేము అతనికి మా కారుణ్యాన్ని ప్రసాదించాము. మా తరఫునుండి ఒక ప్రత్యేక జ్ఞానాన్ని ప్రసాదించాము.

18 అల్కహఫ్  66 - 70 మూసా అతనితో ఇలా అన్నాడు, ‘‘మీరు నేర్చుకున్న వివేకాన్ని, మీరు నాకు కూడ బోధించేందుకు నేను మీ వెంట ఉండవచ్చా?’’ అతను ఇలా అన్నాడు, ‘‘మీరు నా విషయంలో సహనంతో వ్యవహరించలేరు. అసలు మీకు తెలియని విషయాన్ని గురించి సహనం చూపటం మీకు ఎలా సాధ్యం?’’ మూసా ఇలా జవాబు పలికాడు, ‘‘ఇన్షాఅల్లాహ్ (అల్లాహ్ సంకల్పిస్తే) మీరు నన్ను సహనశీలునిగా చూస్తారు. వ్యవహారంలోనూ నేను మీకు అవిధేయత చూపను.’’ అతను ఇలా అన్నాడు, ‘‘మంచిది ఒకవేళ మీరు నాతో రాదలిస్తే స్వయంగా నేను మీతో ప్రస్తావించే వరకు నన్ను విషయమూ అడగకండి.’’

18 అల్కహఫ్  71 - 73 అప్పుడు వారు ఉభయులూ బయల్దేరారు, చివరకు వారు ఒక పడవ ఎక్కినప్పుడు, వ్యక్తి పడవకు రంధ్రం చేశాడు. మూసా అప్పుడు ఇలా అన్నాడు, ‘‘పడవలో ఉన్న వారందరినీ ముంచటానికా మీరు దానికి రంధ్రం చేశారు? మీరు చేసినది దారుణమైన పనే.’’ అతను ఇలా పలికాడు, ‘‘మీరు నా పట్ల సహనం చూపలేరని నేను మీకు చెప్పలేదా?’’ మూసా ఇలా అన్నాడు, ‘‘మరచిపోయి చేసిన దానికి నన్ను తప్పు పట్టకండి నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి.’’

18 అల్కహఫ్  74 - 76 తరువాత వారు ప్రయాణం సాగించారు. చివరకు వారిని ఒక బాలుడు కలిశాడు  వ్యక్తి అతనిని చంపివేశాడు. మూసా ఇలా అన్నాడు, ‘‘మీరు ఒక అమాయకుని ప్రాణాన్ని తీశారు. వాస్తవానికి అతడు ఎవరినీ హత్యచేయలేదు కదా! మీరు చేసిన పని చాల చెడ్డది.’’ అతను ఇలా అన్నాడు, ‘‘మీరు నాతో సహనంగా ఉండలేరని నేను మీకు చెప్పలేదా!’’ మూసా ఇలా పలికాడు, ‘‘దీని తరువాత ఒకవేళ నేను మిమ్మల్ని ఏదైనా అడిగితే, మీరు నన్ను మీ వెంట ఉండనీయకండి. ఇదిగో, ఇప్పుడు మీకు నా వైపు నుండి సాకు దొరికిపోయింది.’’

18 అల్కహఫ్  77 - 82 తరువాత వారు ముందుకు సాగిపోయారు. చివరకు ఒక పట్టణానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలను అన్నం పెట్టమని అభ్యర్థించారు. కాని వారు వీరిద్దరికీ ఆతిథ్యమీయటానికి తిరస్కరించారు. అక్కడ వారు కూలిపోనున్న ఒక గోడను చూశారు. వ్యక్తి గోడను మళ్ళీ నిలబెట్టాడు. మూసా ఇలా అన్నాడు, ‘‘మీకు ఇష్టమైతే శ్రమకు ప్రతిఫలం తీసుకునేవారు.’’ ఆయన ఇలా అన్నారు, ‘‘ఇక చాలు మన సహవాసం ముగిసింది. ఇక మీరు సహనం చూపలేకపోయిన విషయాల తత్వాన్ని నేను మీకు వివరిస్తాను. పడవ వృత్తాంతం ఏమిటంటే, అది నదిలో కష్టపడి పని చేసుకునే కొందరు నిరు పేదలది. నేను దానికి లోపం కల్పించాలని ఎందుకు అనుకొన్నానంటే ప్రతి పడవను బలవంతంగా వశపరచుకొనే ఒక రాజుకు చెందిన ప్రాంతం ముందు రాబోతోంది. ఇక బాలుని విషయం - అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తన తలబిరుసుతనం వల్లా, తన అవిశ్వాసం వల్లా, వారిని వేధిస్తాడనే భయం మాకు కలిగింది. కారణం వల్ల మేము కోరుకున్న దేమిటంటే, వారి ప్రభువు అతనికి మారుగా, నడవడికలో అతనికంటే మంచివాడునూ, రక్త సంబంధీకులను ఎక్కువగా కనికరిస్తాడని ఆశించదగిన వాడునూ అయిన మరొక బిడ్డను వారికి ఇవ్వాలని. ఇక గోడ విషయం ఏమిటంటే, అది పట్టణంలోనే నివసిస్తున్న ఇద్దరు అనాథబాలురిది. గోడ క్రింద బాలుర కోసం ఒక నిధి పాతిపెట్టబడి  ఉన్నది.  వారి తండ్రి చాల మంచివాడు. అందుకని ఇద్దరు బాలురూ యుక్తవయస్కులైన పిమ్మట తమ నిధిని తాము తీసుకోవాలని నీ ప్రభువు సంకల్పించాడు. ఇదంతా నీ ప్రభువు కారుణ్యం మూలంగా నేను చేశాను. నా అంతట నేను చేయలేదు. నీవు సహనం చూపలేని విషయాల వాస్తవికత ఇది.’’

18 అల్కహఫ్  83 ప్రవక్తా! ప్రజలు నిన్ను జుల్ఖర్నైన్ను గురించి అడుగుతున్నారు. వారితో ‘‘నేను అతనిని గురించి మీకు కొంచెం వినిపిస్తాను’’ అని అను.

18 అల్కహఫ్  84 - 88 మేము అతనికి ధరణిలో అధికారాన్ని ప్రసాదించాము. అతనికి అన్ని రకాల సాధనాలనూ, వనరులనూ ఇచ్చాము. అతను (మొదట పశ్చిమ దిశకు దండయాత్ర చేయటానికి) సన్నాహాలు చేశాడు. చివరకు అతను సూర్యుడు  అస్తమించే  హద్దుకు చేరినప్పుడు, నల్లని నీటిలో సూర్యుడు మునుగుతూ ఉండగా అతను చూశాడు. అక్కడ అతనికి ఒక జాతి ప్రజలు కనిపించారు. అప్పుడు మేము ఇలా అన్నాము, ‘‘జుల్ఖర్నైన్‌! జాతి ప్రజ లను శిక్షించటానికిగానీ, వారిపట్ల ఉదార వైఖరిని అవలంబించటానికి గానీ నీకు అధికారం ఉన్నది.’’ అతను ఇలా అన్నాడు, ‘‘వారిలో దౌర్జన్యం చేసేవాడిని మేము శిక్షిస్తాము. ఆపై అతడు తన ప్రభువు వైపునకు మరలింపబడతాడు. అప్పుడు ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు. వారిలో విశ్వసించిన వాడికీ, సత్కార్యాలు చేసేవాడికీ మంచి ప్రతిఫలం లభిస్తుంది. అంతేకాదు మేము అతడికి తేలికపాటి ఆజ్ఞలను ఇస్తాము.’’

18 అల్కహఫ్  89 - 91  తరువాత అతను (మరొక దండయాత్ర కోసం) సన్నాహాలు చేశాడు.  చివరకు అతను సూర్యుడు ఉదయించే హద్దువరకు పోయాడు. అక్కడ అతను ఒక జాతిపై సూర్యుడు ఉదయించటం చూశాడు, దాని కోసం మేము ఎండనుండి రక్షణ పొందే ఏర్పాటు ఏదీ చేయలేదు. ఇదీ వారి స్థితి. జుల్ఖర్నైన్వద్ద ఉన్నది ఏమిటో మాకు తెలుసు.

18 అల్కహఫ్  92 - 98 తరువాత అతను (మరొక దండయాత్రకు) సన్నాహాలు చేశాడు  చివరకు అతను రెండు పర్వతాల మధ్యకు చేరినప్పుడు, అక్కడ అతనికి ఒక జాతి కనిపించింది.   జాతి విషయాన్నైనా అతి కష్టం మీదగాని అర్థం చేసుకోలేదు. వారు ఇలా అన్నారు, ‘‘జుల్ఖర్నైన్‌! యాజూజ్, మాజూజ్లు భూభాగంలో కల్లోలాన్ని వ్యాపింపజేస్తున్నారు. కనుక నీవు మాకూ వారికీ మధ్య అడ్డంగా ఒక గోడను నిర్మించు. అందుకు మేము నీకు ఏదైనా సుంకం చెల్లించాలా?’’ అప్పుడు అతను ఇలా అన్నాడు, ‘‘నా ప్రభువు నాకు ఇచ్చినదే నాకు చాలు. మీరు మటుకు శ్రమద్వారా నాకు సహాయపడండి, నేను మీకూ, వారికీ మధ్య అడ్డంగా గోడ కడతాను. నాకు ఇనుపరేకులను తెచ్చి ఇవ్వండి.’’ చివరకు రెండు పర్వతాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని అతను పూడ్చివేసి, ప్రజలతో ‘‘ఇక మంటలు రగిలించండి’’ అని అన్నాడు. తరువాత ( ఇనుప గోడను) పూర్తిగా నిప్పుమాదిరిగా ఎర్రగాచేసి అతను, ‘‘ఇక కరిగిన రాగిని తీసుకురండి. దీనిపై కుమ్మరిస్తాను’’ అని అన్నాడు. ( గోడ ఎటువంటిదంటే) యాజూజ్, మాజూజ్లు దానిపైకి ఎక్కిరానూలేరు  దానికి కన్నం వేయటం వారికి ఇంకా కష్టతరం. జుల్ఖర్నైన్ఇలా అన్నాడు, ‘‘ఇది నా ప్రభువు కరుణ, కాని నా ప్రభువు యొక్క వాగ్దాన సమయం ఆసన్నమయి నప్పుడు, ఆయన దానిని నేలమట్టం చేస్తాడు. నా ప్రభువు వాగ్దానం నిజమైనది.’’

18 అల్కహఫ్  99 - 101 రోజున మేము ప్రజలను వదలిపెడతాము. వారు (సముద్రపు అలలు మాదిరిగా) ఒకరితో ఒకరు అల్లకల్లోలంగా కలిసిపోతారు. బాకా ఊదబడుతుంది. మేము మానవులను అందరినీ ఒకేసారి సమావేశపరుస్తాము. రోజున మేము నరకాన్ని అవిశ్వాసుల ముందుకు తీసుకువస్తాము  వారు మా హితోపదేశం పట్ల గుడ్డివారై పోయారు. అసలు దానిని వినటానికి ఏమాత్రం సిద్ధపడలేదు.

18 అల్కహఫ్  102 అయితే తిరస్కారులు,  నన్ను కాదని, నా దాసులను తమ కార్య సాధకులుగా చేసుకునే తలంపు కలిగి ఉన్నారా? అటువంటి అవిశ్వాసులకు ఆతిధ్యంగా మేము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము.

18 అల్కహఫ్  103 - 108 ప్రవక్తా! వారితో ఇలా అను: తాము చేసిన పనుల విషయంలో అందరికంటే ఎక్కువగా విఫలులయ్యేవారు ఎవరో, నష్టపోయే వారెవరో మేము మీకు తెలుపమంటారా? వారెవరంటే, ప్రాపంచిక జీవితంలో వారి ప్రయత్నాలు అన్నీ ఋజుమార్గం నుండి వైదొలగి ఉంటాయి. అయినా వారు తాము చేసే దంతా సవ్యంగానే ఉందని భావిస్తారు. వారు తమ ప్రభువు వాక్యాలను నమ్మకుండా తిరస్కరించినవారు. ఆయన సాన్నిధ్యంలో హాజరు కావలసి ఉన్నదనే విషయాన్ని విశ్వసించనివారు. ఇందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. ప్రళయదినం నాడు మేము వాటికి ఏమాత్రమూ విలువ నీయము. వారి ప్రతిఫలం నరకం - వారు అవిశ్వాసానికి పాల్పడినందుకు బదులుగా, వారు మా వాక్యాలనూ, మా ప్రవక్తలనూ ఎగతాళి చేసినదానికి ఫలితంగా. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి ఆతిధ్యంగా ఫిరదౌసు (స్వర్గపు) ఉద్యానవనాలు ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. స్థలాన్ని వదలి మరెక్కడికైనా పోవాలని వారి మనస్సు ఎన్నడూ కోరదు.

18 అల్కహఫ్  109 ప్రవక్తా! ఇలా ప్రకటించు, ‘‘ఒకవేళ నా ప్రభువు మాటలు వ్రాయటానికి సముద్రజలమే సిరాఅయినా, అది ఖాళీ అయిపోతుంది గాని, నా ప్రభువు మాటలు మాత్రం పూర్తికావు. అంతేకాదు, మేము మళ్లీ ఇంతే సిరాను తెచ్చినా, అది కూడ సరిపోదు.’’

18 అల్కహఫ్  110 ప్రవక్తా! ఇలా చెప్పు, ‘‘నేను కేవలం ఒక మానవుణ్ణి, మీలాంటివాణ్ణి, నాకు వహీద్వారా ఇలా తెలుపబడిరది. మీ దైవం కేవలం ఒకే దైవం. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి, ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు.’’




No comments:

Post a Comment